పరకాల ఎమ్మెల్యేను సన్మానించిన టీఆర్‌ఎస్ నేతలు
నర్సంపేట, జూన్ 17(జనంసాక్షి) :
నూతనంగా ఎన్నికైన పరకాల ఎమ్మెల్యే మొలుగూ రి బిక్షపతిని ఆదివారం చెన్నారావుపేట టిఆర్‌ఎస్ నాయకులు పరకాలలో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా జేఏసీ మండల కన్వీనర్ మోటూ రి రవి మాట్లాడుతూ పరకాల ఎన్నికల్లొ సమైక్య వాద పార్టీలను ఓడించి తెలంగాణ ప్రజల ఆకాం క్షకు అనుగుణంగా బిక్షపతి గెలుపొందాడన్నారు. బిక్షపతి గెలుపుకు కృషి చేసిన తెలంగాణ వాదులకు, ప్రజాసంఘాలకు ఆయన అభినంద నలు తెలిపారు. ఇదే ఐక్యతతో ప్రజాఉద్యమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంను సాధించుకో వాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో టీిఆర్ ఎస్ నాయకులు అండ్ర వీరారెడ్డి, మల్లికార్జున్, గాదె భద్రయ్య, రాజేందర్, అశోక్, రజిత, పద్మ, సునీల్, తిరుపతి, సాంబయ్య, రమేష్, సదానం దం, కుమారస్వామి, లక్ష్మయ్య, రవీంద్రాచారి, సంపత్, రమేష్, దేవేందర్, కనకయ్య, మల్లయ్య, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.