పరిగిలో చంద్రబాబుకు తెలంగాణ సెగ
రంగారెడ్డి: నవంబర్ 12, (జనంసాక్షి):
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తలపెట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన విషయం విదితమే అయితే జిల్లాలోని పరిగిలో కొనసాగుతున్న పాదయాత్ర కాస్తా ఉద్రిక్తతంగా మారింది. చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జై తెలంగాణ నినాదాలతో మార్మోగించారు. రెండు కళ్ల సిద్దాంతాన్ని వదిలి స్పష్టమైన వైఖరిని ప్రకటించాకే పాదయాత్ర కొనసాగించాలని నినాదాలు చేశారు. దీంతో టీడీపీ గుండాలు తెలంగాణ వాదులపై దాడికి తెగబడ్డారు. పలువురు తెలంగాణ వాదులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.