పరిశ్రమలకు ఊరట

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్

దిల్లీ, ఏప్రిల్ 13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల్లో పడిన పారిశ్రామిక సంస్థలను అదుకునేందుకు కేంద్రం సిద్ధమౌతోంది. ముఖ్యంగా రుణవాయిదాలు చెల్లించకపోతే రుణదాత సంస్థలు తీసు కునే దివాళాప్రక్రియ నుంచి కంపెనీలకు మరో ఆరునెలలపాటు వెసు లుబాటు ఇచ్చేలా ప్రత్యేక ఆర్డినె న్సును తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. కేబినెట్ తదపరి సమావేశంలో దీనికి సంబంధించి అధికారిక నిర్ణయం వెలు వడునున్నట్టు ఆమె తెలి పారు. అయితే ఇప్పటికే దివాళా ప్రక్రియలోకి చేరుకు న్న కంపెనీలకు మాత్రం ఇది వర్తించదన్నారు. ఆమె మాట్లాడుతూ.. కరోనా వైరస్ ని యంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ స మయంలో అన్ని వ్యాపారసంస్థల్లో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయా యి. దీంతో ఉద్యోగులకు చెల్లించే జీతాలు, రుణ వాయిదా చెల్లింపులు, జీఎస్టీటీ తదితర పన్నులన్నీ నిరర్థక ఆస్తులుగా మారిపోయి,కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తాయి. కొత్త దివాళా చట్టం 2016 ప్రకారం సంస్థలు తమ చెల్లించాల్సిన రుణవాయిదా చెల్లింపులు ఒక్క రోజు ఆలస్యమైనా వాటిని బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా పరగణిస్తాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆరునెలలపాటు వెసులుబాటు కల్పిస్తూ 2016దివాళా చట్టంలో మార్పు చేస్తునట్టు ఆమె పేర్కొన్నారు. అనంతరం ఉండే పరిస్థితులను బట్టి గడువు ఇంకా పెంచాలా, వద్దా అనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నిర్ణయం తప్పకుండా కంపెనీలకు ఉపయుక్తంగా మారుతుందని ఆమె తెలిపారు. అయితే ఏప్రిల్ 15తో ముగిసే మొదటిదశ లాక్ డౌన్ తర్వాత కొన్ని సంస్థలకు లా డౌన్ నుంచి మినహాయింపు ఇస్తారనే ఊహగానాలు వెలువడుతున్నాయి. వీటిన్నంటికి సమాధానం దొరకాలంటే రేపు ఉదయం ప్రధాని 10 గంటలకు నిర్వహించే మీడియా సమావేశం కోసం ఎదురుచూడాల్సిందే.