పర్యావరణ పరిరక్షణకు సైకిల్‌ యాత్ర

నిజామాబాద్‌, జనవరి 4 (): పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని  కోరుతూ నిజామాబాద్‌ నగరంలో పాదయాత్ర నిర్వహిస్తున్నానని జనవికాస్‌ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డి.ఎల్‌.ఎన్‌.చారి తెలిపారు. మూడురోజులుగా నగరంలోని ప్రధానవీధులలో సైకిల్‌ యాత్ర నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. దుకాణంలో క్యారీబ్యాగ్‌ల అమ్మకాలు నిషేధించాలని ఆయన మరోసారి డిమాండ్‌చేశారు. ప్లాస్టిక్‌ సంచుల వాడకం వల్ల ప్రపంచ మానవాళితోపాటు పశువులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూమాత పరిరక్షణకు ప్రజలు ప్లాస్టిక్‌ వస్తువుల వాడకం తగ్గించాలని కోరారు. తన సైకిల్‌ యాత్ర జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తానని అన్నారు.