పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.

అశ్వరావుపేట, అక్టోబర్ 23(జనంసాక్షి) అశ్వరావుపేట మండల ప్రజలకు ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అన్నారు.ఈ దీపావళి ప్రతి ఇంటిలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆకాంక్షించారు.దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణకు ప్రతీక దీపావళి పండుగ అన్నారు.జగతిని జాగృతిచేసే చైతన్యదీప్తిల శోభావళి,ప్రతి ఇంటా ఆనందదివ్వె లు వెలగాలని కోరారు.ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు.ఒకొక్క అడుగు ముందుకు వేసి నియోజకవర్గ అభివృద్ధి సాధించాలని,ఈ దీపావళి ప్రజలులందరి జీవితాల్లో వెలుగులు నింపాలని , అజ్ఞానపు చీకట్లు తొలగించే విజ్ఞాన దీపాల తేజోత్సవంగా దీపావళిని ఆయన అభివర్ణించారు.పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ సంబురాలను ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలన్నారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఆనందపు వెలుగులు నింపాలన్నారు.