పల్లెల అభివృద్దికి బాటలు వేద్దాం

ప్రజలకు కలెక్టర్‌ పిలుపు
మంచిర్యాల,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     గ్రావిూణ ప్రాంతంలోని ప్రతి ప్లలె అభివృద్ధి చెంది అద్దంలా మెరవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా వివిధ గ్రామాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామామ అభివృద్ధిలో అందరం భాగస్వాములవుతాం.. మరుగు దొడ్లు నిర్మించుకుంటాం, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్లలెలు అ భివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సందేశం పేరిటా 30 రోజుల ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో ప్రతి అంశాన్ని గుర్తించాలన్నారు. శిథిల భవనాలను తొలగించాలనీ, ఖాళీ స్థలాలతో పాటు ప్రజల ఇండ్ల పరిసరాలు, చేళ్లలో మొక్కలు నాటాలని సూచించారు. ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే చెట్లు పెంచుకోవడం చాల ముఖ్యమన్నారు.
అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అక్కడ అవసరం ఉన్న ప్రతి అభివృద్ధి పనిని గుర్తించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఇదిలావుంటే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పిలుపునిచ్చారు. జిల్లాలోని పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఇంగ్లిష్‌, గణితం సులభంగా చదువుకునేందుకు పుస్తకాలు తయారు చేసి అందజేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల బోధన కోసం ఇప్పటిదాకా 54 డిజిటల్‌ టీవీలను అందజేసినట్లు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెప్పారు. విద్యార్థులు చదువులో ముందుండేందుకు ఉపయోగపడ్డాయన్నారు. నియోజకవర్గంలో ఆర్టీసీలో ప్రయాణించే విద్యార్థులకు బస్‌ పాసులను అందించేందుకు తన వంతుగా రూ.90 వేల ను ఆర్టీసీ డీఎంకు అందజేయనున్నట్లు చెప్పారు. మూతపడ్డ ఎస్పీఎం మిల్లు పునఃప్రారంభం కావడం సంతోషకరమన్నారు.

తాజావార్తలు