పల్లె ప్రకృతి వనంలో పశువులు.
జనం సాక్షి 22 అక్టోబర్: దమ్మపేట మండలం మారెప్పగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని జలవాగు లో గల పల్లె ప్రకృతి వనం పశువులకు అలుసుగా దొరికింది ఇక్కడ ప్రజా ప్రతినిధులు ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో పశువుల కాపరులు ఇష్టానుసారంగా పల్లె ప్రకృతి వనంలో మేపుతున్నారు స్థానిక సర్పంచ్ కానీ ఉపసర్పంచ్ గాని సెక్రటరీ కానీ అటువైపు వెళ్లి చూసిన దాఖలాలే లేవు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కనుక మొక్కుబడిగా తమ పంచాయితీలో కూడా ఉన్నదని తెలుపుటకు మాత్రమే పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు కొన్నిచోట్ల పట్టించుకునే నాధుడే లేక పల్లె ప్రకృతి వనం ఎక్కడ ఉందో తెలుసుకోవలసిన దుస్థితి గ్రామ ప్రజలకు అధికారులకు గతి పట్టినది ఇకనైనా అధికారులు తగు చర్యలు తీసుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రజలు వాపోతున్నారు.