*పల్లె ప్రకృతి వనాలను సందర్శించిన ఎంపిడిఓ కథలప్ప*


వీపనగండ్ల ఆగస్టు 01 (జనం సాక్షి) వీపనగండ్ల మండలంలోని కొర్లకుంట గ్రామంలో పల్లె ప్రకృతి వనం సందర్శించి కలుపు మొక్కలను నివారించవలసిందిగా పంచాయతీ కార్యదర్శి కి సూచించడమైనది.అవసరం ఉన్నచోట మొక్కలు నాటాల్సిందిగా కోరనైనది. వేపుగా ఎదుగుటకు వాడవలసిన పద్ధతులను సూచించనైనది. క్రీడా ప్రాంగణం పనులను వేగినపరిచి త్వరగా పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు.
బొల్లారం గ్రామపంచాయతీ పల్లె ప్రకృతి వనం సందర్శించి కాళీ ఉన్నచోట్ల మొక్కలు నాటవలసిందిగా పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ కు సూచించనైనది. జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం సందర్శించి , పిల్లలకు రుచికరమైన భోజనం మెనూ ప్రకారం కల్పించవలసిందిగా సూచించనైనది క్రీడా ప్రాంగణంలో బౌండరీ చుట్టూ మొక్కలు నాటువల్సిందిగా ఆదేశించనైనది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయులు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ కొర్లకుంట కార్యదర్శి రాము పాల్గొన్నారు.