పవన్ సరసన ఐపీఎల్ బ్యూటీ
బెంగళూరు : పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సరసన ఐపీఎల్ బ్యూటీ, యాంకర్ రొచెల్లా రావు నటించనున్నట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వెల్‌గా మరో సినిమా వస్తున్న విషయం విదితమే. ఇందులో ఆమె ఓ ప్రత్యేక గీతంలో నర్తించనుందట. రొచెల్లా రావు ఐపీఎల్-6 యాంకర్‌గా అలరిస్తోంది. ఆమె 2012లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం కూడా దక్కించుకుంది. రొచెల్లారావుతో పాటు మరో నటి కరిష్మా కొటక్ కూడా ఐపీఎల్‌లో యాంకరింగ్ చేస్తోంది.