సవితమృతిపై వివరణకోరిన అమ్నెస్టీసంస్థ

 

లండన్‌(జనంసాక్షి), అబార్షన్‌ జరగకపోవడం వలన భారత దంత వైద్యురాలు సవిత హలప్పనవర్‌ చనిపోవటంపై అంతర్జాతీయ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఐర్లాండ్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరింది ఐర్లాండ్‌ ప్రభుత్వ విధానాలు అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలకు అనుగుణంగా ఉండేటట్లు చూడాలని సూచించింది సవిత మృతి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఐర్లాండ్‌ ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాసింది. ఈ ఘటన ఆదేశచట్టాలలోని లోటును ఎత్తి చూపుతోందని పేర్కొంది తన జీవితానికి ముప్పు ఉందనుకున్నపుడు గర్భస్రావం చేయించుకునే హక్కు ఒక మహిళకు ఉంటుందని అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయని అమ్నెస్టీ సంస్థ ఐర్లాండ్‌ ప్రతినిధి గోర్మన్‌ చెప్పారు ఈహక్కును పరిరక్షించడంలో ఐర్లాండ్‌ను పాలిస్తూ వస్తున్న ప్రభుత్వాలు విఫలమయ్యాయని ,దీనివలన అక్కడ మహిళలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు ఈ హక్కును రాజ్యాంగ సూత్రంగా ఐర్లాండ్‌ సుప్రీంకోర్ట్‌ ఇప్పటికే స్పష్టంగా పేర్కొందని అయినా దీనిపై స్పష్టత లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.