పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన వైద్య సిబ్బంది
మల్దకల్ అక్టోబర్ 8 (జనంసాక్షి) మండల పరిధిలోని నీల్లీపల్లి,మద్దెల బండ,నాగర్ దొడ్డి గ్రామాలలో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ముద్ద చర్మ వ్యాధి(లాంఫి స్కిన్ )నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం గురించి మల్దకల్ మండల పశువైద్యధికారి డాక్టర్ వినయ్ కుమార్ లాంఫి వైరస్ సోకినా పశువులు శరీరం పై గుడుపలు,దద్దురులు రావటం,కాళ్లకు వాపులు రావటం,గుడుపలు పగిలి రక్తం కారటం వ్యాధి ముదిరితే పశువు చనిపోవటం జరుగుతుందని రైతులకు వివరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా1242 పశువులకు ఉచ్చితంగా టీకాలు వేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సువార్తమ్మ, ఉపసర్పంచ్ ఉరుకుందమ్మా, ఎంపిటిసి సరోజమ్మ,వి ఎల్ ఓ వెంకటేశ్వర్లు,జెవిఓ రాఘవేందర్,విఏ ర్రాజేంద్ర, సిబ్బంది రామాంజనేయులు, మధు తదితరులు పాల్గొన్నారు.