*పాండవుల గుట్టను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా*

*భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి*
*బుగులోని గుట్ట వద్ద శివాలయం నిర్మాణానికి భూమి పూజ*
రేగొండ (జనం సాక్షి): పాండవుల గుట్టలను,బుగులోని జాతర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. గురువారం రేగొండ మండలంలోని తిరుమలగిరి శివారులో గల బుగులోని గుట్ట వద్ద శివాలయం నిర్మాణానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ గతంలోనే ఆలయ నిర్మాణం కోసం 53 లక్షలు మంజూరు చేయించానని, దేవాదాయ శాఖలో కాంట్రిబ్యూషన్ కూడా చెల్లించామని తెలిపారు. శివాలయం, వారి ఆలయం, పద్మావతి దేవాలయం నిర్మించేందుకు నిధులు మంజూరైనట్టు తెలిపారు. పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. నిత్యం వెంకటేశ్వర స్వామికి పూజలు అందే విధంగా ఇక్కడ అభివృద్ధి చేస్తామని అన్నారు. పాండవుల గుట్టల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుగులోని జాతర చైర్మన్ కడారి జనార్ధన్, స్థానిక సర్పంచ్ కట్ల రాణి మధుసూదన్ రెడ్డి, తీపి పున్నాం లక్ష్మి, జడ్పిటిసి సాయిని విజయ, రైతుబంధు జిల్లా అధ్యక్షులు హింగే మహేందర్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఎండి రహీం, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్,సర్పంచులు నడిపెల్లి శ్రీనివాసరావు, పాతపల్లి సంతోష్, అంబల చందు, ఎంపీటీసీలు గంట గోపాల్, గండు కుమార్, కే సి రెడ్డి ప్రతాపరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు అమ్ముల రాజయ్య, రవి సామ్రాట్, రజినీకాంత్, పట్టేం శంకర్, అమ్ముల సదయ్య, వెంకటస్వామి తది తరులు పాల్గొన్నారు.