పాకిస్థాన్‌పై వెస్టిండీస్ ఘన విజయం
150 పరుగుల తేడాతో విండీస్ గెలుపు
క్రైస్ట్‌చర్చ్, ఫిబ్రవరి 21 : క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై వెస్టిండీస్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ విండీస్ బౌలర్ల ధాటికి కుదేలైపోయింది. 39 ఓవర్లలో 160 పరుగులు చేసి పాకిస్థాన్ ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లు టేలర్, రసెల్‌కు చెరో మూడు వికెట్లు, బెన్‌కు రెండు వికెట్లు దక్కాయి. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్లు అక్మల్, మక్బూద్, అఫ్రిది మినహా మిగిలిన వారు రెండంకెల స్కోరును చేయలేకయారు. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌కు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌గా రసెల్ నిలిచారు
స్కోర్లు :
వెస్టిండీస్ – 310/5
పాకిస్థాన్ – 160 ఆలౌట్