పాక్ ఆటగాడు వంగితే
విజయమేనట!
ఢిల్లీ, జూన్ 23 : పాక్ ఆటగాడు గ్రౌండుపై వంగున్నాడంటే ఇండియా విజయం సాధించినట్లే. పాకిస్తాన్ ఓపెనర్లలో ఒకడైన నసీర్ జష్మెడ్ సెంచరీ చేసిన అనంతరం భూమిని వెంటనే వెన్ను వంచి భూమిని ముద్దాడుతూ కాసేపు ప్రార్థనలు చేశాడు. అప్పటివరకు ఇండియా పని అయిపోయిందనుకున్నారంతా. వారిలో కొందరు మాత్రం ఇండియా గెలుస్తుందన్న దీమాతో బల్లగుద్ది మరీ చెప్పడం మొదలెట్టారు. ఎలా గెలుస్తుంది బాబు అని నిలదీస్తే పాక్ ఆటగాళ్లలో ఎవరైనా ఇలా విజయోత్సాహంతో గ్రౌండ్‌లో వంగి భూమిని తాకారంటే ఖచ్చితంగా ఆ పిచ్ వాళ్లను ఓడించి తీరుతుందని చెప్పాడు. ఎలా చెప్పగలరంటే గతంలో యూనిస్‌ఖాన్ ఫాస్ట్ బౌలర్ రియాజ్‌లు కూడా ఇలాగే భారత్‌పై మంచి స్కోరు చేసినప్పుడు వికెట్లు తీసినప్పుడు పిచ్‌ను ముద్దాడారనీ, ఆ సమయంలో పాకిస్తాన్ పరాజయం పాలైందని కొత్త వాదన తెచ్చారు. అవును ఎవరి విశ్వాసం వారిది. సచిన్ జట్టు పెంచినందుకే శతకం బాదగలిగాడని కొంతమంది అంటున్నారు. ఇదీ సంగతి.