పాక్‌ నుంచి బెదిరింపు కాల్స్‌

కాశ్మీర్‌ బిజెపి చీఫ్‌ ఆందోళన

న్యూఢిల్లీ,జూన్‌ 21(జ‌నం సాక్షి): తనకు ప్రాణహాని ఉందంటూ జమ్మూ కశ్మీర్‌ బీజేపీ చీఫ్‌ రవీందర్‌ రైనా ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ నుంచి తనకు బెదిరింపు కాల్‌ వస్తున్నాయన్నారు. జర్నలిస్టు షుజాత్‌ బుఖారీ మాదిరిగానే తనను కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ఓ పిరికిపందల దేశం. లా¬ర్‌, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్‌ తదితర చోట్ల నుంచి అనేక ఏళ్లుగా నాకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. పాక్‌ వ్యతిరేక నినాదాలు చేయడం మొదలు పెట్టిన దగ్గర్నుంచి తరచూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించిన నాటి నుంచి ఇది మరింత ఎక్కువైంది. ఇవాళ కూడా జమ్మూలో నేను యోగా డేలో పాల్గొన్న తర్వాత కరాచీ నుంచి బెదిరింపు కాల్‌ చేశారు…’ అని రవీందర్‌పేర్కొన్నారు. దీంతో సంబంధిత అధికారులతో పాటు గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రాకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటికి వచ్చేసిన కొద్ది రోజుల తర్వాతే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.