పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా
– సర్పంచ్ లక్ష్మీ ఆనంద్
కుల్కచర్ల, నవంబర్ 19 (జనం సాక్షి):
ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ముజాహిద్పూర్ సర్పంచ్ లక్ష్మీ ఆనంద్ అన్నారు.శనివారం కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గత కొన్ని రోజుల నుంచి మరుగుదొడ్లలకు నీటి సౌకర్యం లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో పైపుల ద్వారా నిర్మాణ పనులను ప్లంబర్ తో వర్క్ చేయించి నీటి సౌకర్యం కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీ మాట్లాడుతూ..విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.విద్యార్థులు చక్కని చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.అనంతరం ఉపాధ్యాయులు సర్పంచ్ లక్ష్మీ ఆనంద్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధు, పంచాయతీ కార్యదర్శి కర్ణాకర్ రెడ్డి,స్కూల్ టీచర్స్ వెంకటయ్య,చాకలి శ్రీనివాస్, చందర్, పిటి వెంకటేశ్వర్లు,బి వెంకటయ్య, పాఠశాల మధ్యన భోజనం సిబ్బంది ఆర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.