పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి..

 బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్
బాన్సువాడ’ జనంసాక్షి (జులై 06):
ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా, తమ పాఠశాలను పాఠ్యపుస్తకాలు తీసుకోవాలని ఒత్తిడి చేయడం దారుణమని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఇస్తారాజ్యంగా పాఠ్య పుస్తకాలను అధిక రేట్లకు అమ్ముతూ, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని వారన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 70 ను తుంగలో తొక్కి ప్రైవేట్ పాఠశాలల ఆధిపత్యాన్ని చెలాయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కావున సంబంధిత అధికారులు ప్రైవేటు పాఠశాలలో విద్య హక్కు చట్టాన్ని అమలయ్యేలా చూడాలని, ఫీజుల నియంత్రణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు విజయ్ కుమార్, అనిల్, రాఘవ, శైలేష్ తదితరులు పాల్గొన్నారు.