పాఠ్యపుస్తకాలు బూక్కులు లేవు .. యూనిఫామ్ లేదు …సారు
చదువేట్ల సాగుడు సర్…
ప్రభుత్వ పాఠశాలపై ఇంత చిన్న చూపా…
మహాదేవపూర్ జూన్ 27 (జనంసాక్షి)
మహాదేవపూర్ పలిమేల మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలు ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాలలకు ఇంత వరకు యూనిఫామ్ .పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయక పోవడం చాలా దురదృష్టం. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. వారికి ఎప్పటి వరకు పాఠ్యపుస్తకాలు లేక చదువేట్ల చెప్పుడని
ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు మండల కేంద్రంలో అనేక పాఠశాలల్లో ఇప్పటి వరకు .స్కావెంజర్స్ లేక విద్యార్థులే గదులను మూత్రశాలలను. శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుండి . కె జి టూ. పి జి వరకు ఇంగ్లీష్ మీడియం అంటూ మాటలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోక పోవడం చాలా దురదృష్టకరం అని పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే తరుణంలో డెమొక్రటిక్ టీచర్ ఫెడరేషన్ జిల్లా నాయకులు తిరుపతి మాట్లాడుతు. ఇప్పటి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకుండా వారికి యూనిఫామ్ ఇవ్వకుండా విద్యాభ్యాసం ఎలా సాగించేదని వారి బౌష్యత్ బంగారు బౌష్యత్ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పడం మానేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆకాంక్ష ఉంటే ప్రభుత్వం వెంటనే పాఠ్యపుస్తకాలు పంపిణి చెయ్యాలి ఆయన డిమాండ్ చేశారు .ఇప్పటికైనా ప్రభుత్వం తమ బిడ్డల బౌష్యత్ పై దృష్టి సారించి మెరుగైన విద్యకోసం తక్షణమే పాఠ్యపుస్తకాలు మరియు. యూనిఫామ్ అందచేయాలని వేడుకుంటున్నారు.