పాఠ్యపుస్తకాల కోసం ఎస్‌ఎఫ్టీ భిక్షాటన

నర్సంపేట, జూన్‌ 16(జనంసాక్షి) : ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించాల ని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్టీ) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో పాఠ్య పుస్తకాల కోసం భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌టీి జిల్లా అధ్య క్షుడు తాళ్ల సునీల్‌ మాట్లాడుతూ డివిజన్‌లోని ఆ రు మండలాలకు ఒక లక్షా 90వేల పాఠ్య పుస్త కా లు అవసరం ఉండగా ప్రభుత్వం కేవలం 78వేల పాఠ్యపుస్తకాలు మాత్రమే విడుదల చేసిందన్నారు. 3,4,5,6,7 తరగతులకు మారిన సిలబస్‌ ప్ర కారం నమూనా పుస్తకాలను సైతం పంపించ లేద ని విమర్శించారు. పాఠ్యపుస్తకాలు లేకుండా విద్యా ర్థుల చదువులు ఎలా సాగుతాయో ప్రభుత్వమే జవాబు చెప్పాలన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ది పై పాలకులు సవతితల్లి ప్రేమను వలక బోస్తుంద న్నారు. పాలకుల అనాలోచిత విధానాల మూలంగానే విద్యారంగం బ్రష్టుపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మౌళిక వసతులు కల్పించక పోవడంతో పాటు కనీసం పాఠ్యపుస్తకాలు అందించక పో వడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో దారిద్రరేకకు దిగువన ఉన్న విద్యార్థులే విద్యన బ్యసిస్తున్నారన్నారు. వారి విద్యాభివృద్ధికిి పాలక వర్గ ప్రభుత్వాలు చేసిన మేలేమిటో అందరికి తెలుస న్నారు. ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై విద్యార్థిలోకం ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో ఎస్‌ఎఫ్‌టి డివిజన్‌ అధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య, ఉపాధ్యక్షుడు మహేష్‌, నాయకులు కిషో ర్‌, నరేష్‌, భాస్కర్‌, భరత్‌, రాజేందర్‌, అర్జున్‌,  సుమలత,  సుకన్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.