పాఠ్య పుస్తకాల పంపిణీ తో పాటు వసతులను కూడా పర్యవేక్షిస్తున్న మండల తెరస నాయకులు
రుద్రూర్ (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం మనఊరు – మనబడి . ఈ కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో బుధవారం రోజున సర్పంచ్ గంగామణివరప్రసాద్ అధ్యక్షతన గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తెరాస మండల నాయకులు పాఠ్య పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
(జెడ్పిటిసి నారోజి గంగారం):-
గ్రామాల్లోని పేద విద్యార్థులకు
నాణ్యమైన విద్యతో పాటు ఈ ఆధునిక కాలానికి దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నారని తెలిపారు
(అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్):-
మెరుగైన విద్య తో పాటు
మౌలిక వసతులు, గ్రామాలలోని పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన అందిస్తుందని తెలిపారు
( అక్కపల్లి నాగేందర్):-
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ రేంజ్‌లో ఆధునీకరించి, దేశ మరియు రాష్ట్ర భవిష్యత్ కోసం విద్యార్థులను తీర్చిదిద్దడమే తెరాస లక్ష్యమని తెలిపారు
అక్బర్ నగర్ గ్రామంలో గల పాఠశాల మరుగుదొడ్లు నిర్మాణం గురుంచి సభాపతి పోచారం దృష్టికి తీసుకొని పోయి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో
గ్రామ సర్పంచ్ తిగుల్ల గంగమణివరప్రసాద్ , జడ్పిటిసీ నారోజి గంగారాం, తెరాసా మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, తెరాసా నాయకులు అక్కపల్లి నాగేందర్,
ప్రధానోపాధ్యాయులు రవికుమారి, ఉపాధ్యాయురాలు శారద, విద్య కమిటీ చైర్మన్ సీతమ్మ,
మాజీ ఎఎంసి చైర్మన్ సంజీవులు, , వార్డ్ మెంబర్ కార్తిక్, తెరాసా గ్రామ కార్యదర్శి థామస్, నాయకులు బస్వరాజు, సాయిలు , విద్యార్థులు పాల్గొన్నారు.