పాడి రైతుల ఆర్థిక ఎదుగుదలే ప్రభుత్వ లక్ష్యం…
శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 22
తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ పాడి రైతులు ఆర్థిక ఎదుగుదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని శంకరపట్నం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ,చింతల పల్లె గ్రామ సర్పంచ్ పల్లె సంజీవరెడ్డి అన్నారు. శనివారం గ్రామంలో మొలంగూర్ పశు వైద్య అధికారి మాధవరావు ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పాడి రైతుల కోసం, పాడి పశువుల అభివృద్ధి కోసం, ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి, మహిళా సంఘాల ద్వారా, పాడి రైతులకు రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు పాడి రైతులు, సంక్షేమ పథకాల సద్వినియోగం చేసుకునే ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య అధికారి మాధవరావు, సిబ్బంది అరిఫ్, అనిల్, అమీర్ ఖాన్, గోపాల మిత్రులు మొండయ్య, సాయి, పశు మిత్ర అనూష, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.