పాతగుట్టలో వైభవంగా అధ్యయనోత్సవాలు

వేడుకగా ముగిసిన ఎదుర్కోలు ఉత్సవాలు
యాదాద్రిభువనగిరి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): యాదాద్రి పాతగుట్టలో అధ్యనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్ర¬్మత్సవాల్లో ఎదుర్కోలు ఆదివారం రాత్రి ఘనంగ ఆనిర్వహించారు. అమ్మవారిని, స్వామి వారిని కల్యాణమూర్తులుగా అలంకరించి పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి, ఆస్థాన మండపంలో ఎదుర్కోలు మ¬త్సవం నిర్వహించారు. ఎదుర్కోలు వేడుకలు అమ్మవారిని జీవకోటి ప్రతినిధిగా..శ్రీస్వామి వారిని పరమాత్మ ప్రతినిధిగా భావన చేసి భగవానుడిని జీవుడు చేరడం చాలా కష్టం కాబట్టి అమ్మవారి ద్వారా శ్రీవారిని చేరడం సులభమని ఆళ్వార్లు, ఆచార్య పురుషులు అమ్మవారి వైభవాన్ని స్తుతిస్తారు. శ్రీవారిని పరామాత్మతత్వంగా భావించి నిత్యులు, ముక్తులు, పరమపదంలో సేవిస్తారు. విష్ణువక్షస్థల స్థిత అయిన అమ్మవారు భగవానుడికి తమ ఆర్తిని వినిపిస్తూ నిత్యం అనపాయినిగా ఉంటుంది. జగత్‌ రక్షకుడైన భగవానుడు శ్రీదేవి చేసే పురుషాకారానికి సంతసిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. కల్యాణ మ¬త్సవం నిర్వహణతో జీవకోటిని, ప్రకృతిని ఆనందింప జేయడానికి భగవంతుడి అనుగ్రహంగా పెద్దలు ఈ వేడుకలు నిర్వహిస్తారని ప్రధానార్చకులు తెలిపారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణం, నిశ్చయ తాంబూలాలకు ఒప్పందం కుదిరింది. సోమవారం రాత్రి 10 గంటలకు కల్యాణ ఘడియలు నిర్ణయించగా…నృసింహుడికి వరపూజ, వధువు శ్రీలక్ష్మీదేవికి పూలు, పండ్లు కార్యక్రమం జరిగింది. పాతగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఎదుర్కోలు మ¬త్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టువస్త్రాల అలంకరణలతో అశ్వవాహన సేవపై శ్రీనారసింహుడు, ముత్యాల పల్లకి ద్వారా లక్ష్మీదేవి ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరారు. మేళతాళాల నడుమ ప్రధాన మండపానికి చేరారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి ఆలయ ఈవో ఎన్‌.గీత, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నర్సింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.  ప్రధానార్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, మాధవాచార్యులు వైష్ణవ సంప్రదాయ రీతిలో సంబంధం ఖాయమైన ఈ కార్యక్రమాన్ని అర్చకస్వాములు, వేదపండితులు, యాజ్ఞీకులు తదితరులు కలిసి కల్యాణ ఒప్పందాన్ని కుదిర్చారు.