పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న‌కలెక్టర్ దురిశెట్టి అనుదీప్

మెట్ పల్లి జనంసాక్షి న్యూస్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి సూర్యోదయ హైస్కూల్లో పూర్వ విద్యార్థి అయినా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ గారు తాను చదివిన స్కూల్లో సందర్శించారు .
చదువుకున్న రోజులు గుర్తు చేసుకొని తాను కూర్చున్న తరగతి గదులను చూసి పాత జ్ఞాపకాలను ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు కొద్దిసేపు క్లాసు రూముల్లో కూర్చుని అనంతరం విద్యార్థులకు తాను చదువుతున్న రోజుల్లో ఉపాధ్యాయులు ఏ విధంగా విద్యా బోధన చేశారు. తాను ఈ రోజు ఈ స్థాయి లో ఉన్నందుకు విద్య నేర్పిన గురువులకు ధన్యవాదాలు తెలుపుతూ మీరు కూడా మంచి భవిష్యత్తు ఉందని మంచిగా చదువుకోవాలని నాలాగా కలెక్టర్ కావాలని, డాక్టర్ కావాలని పట్టుదలతో చదివి దాన్ని నిజం చేసి చదువు చెప్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు తెలిపారు .
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దొంతుల రాజ్ కుమార్. డైరెక్టర్ చెర్ల పెళ్లి రాజేశ్వర్గౌడ్ .ప్రిన్సిపాల్ విజయ కుమారి .చర్లపల్లి అరుణ్ దీప్ గౌడ్. దొంతుల నిఖిల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు