పాత వ్యవసాయ గోదాంల పై ప్రభుత్వం శీతకన్ను

కరీంనగర్‌ టౌన్‌,్‌ ఆగస్టు2 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా వ్యవసాయ శాఖ పరిపాలన విభాగం రైతుల పాలిట శాపంగా మారింది. వ్యవసాయ ఆధికారులు లేక మండల వ్యవసాయ శాఖ కుంటుపడుతూ ఉంటే వర్షాలు పడడంతో విత్తనాలు వేద్దామనుకున్న రైతులకు నిరాశ ఎదురవుతోంది. పత్తి విత్తనాలు భ్లాక్‌ గోదాంలకు తరలిపోయి 900 రూపాయలు గల విత్తనాల ధర బ్లాక్‌లో 2000 రూపాయల నుండి 3000రూపాయల వరకు పలికింది. మండలాల వారిగా వ్యవసాయ విస్తరణ ఆధికారి లేక ఇంచార్జిలతో కొన్నాళ్ల పాటు పాలన కొనసాగింది. 30 ఆధికారులను కొత్తగా నియమించినప్పుటికీ వారు భాధ్యతలు తీసుకొలేదు. ఇన్‌ఫూట్‌ సబ్‌ గ్రామాలలో ఆధర్శ రైతులు ఇచ్చిన లిస్టుల ప్రకారం బ్యాంకుల్లో జమ కావడంలేదు. మండల కేంద్రాల విత్తన గోదాంలు, వ్యవసాయ పనిముట్లు గోదాంలు లేక, ఎండల్లో ఎండి, వానలో తడిచి తుప్పు పడుతున్నాయి. పూర్వం సమితులుగా కొనసాగిన ప్రాంతల్లో ఉన్న  వ్యవసాయ గోదాంలు పై కప్పు కూలి, దర్వాజాలు చెదలు పట్టి, కిటికిలు లేక మూత్రశాలలుగా మారాయి. నివాస క్వార్టర్లు కూడా శిథిలావస్థంగా చేరున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవయశాఖ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందనీ, ఎన్నికల సమయంలో రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అని డాంబికాలు పలికే రాజకీయ నాయకులు ఆ వ్యవశాయశాఖ పై, రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం భాధాకరమని రైతులు మండిపడ్తున్నారు. పాలకులు, రైతుల వెన్నుముకలు విరిచేస్తున్నారని, కరెంటు సరఫరా, విత్తనాల సరఫరా, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల సమస్యలపై శ్రద్ధ తీసుకొని రైతులను వలసకార్మికులుగా, కూలీలుగా మారేకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.