పానుగల్ మండలంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పానుగల్ ఆగస్టు 15( జనం సాక్షి )
పానుగల్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ను ఎగురవేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.పానుగల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగన్న,ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి,,సింగిల్ విండో లో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,పి హెచ్ సి లో డాక్టర్ రాజశేఖర్,తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ యేసయ్య,లైబ్రరీలో లైబ్రేరియన్ ఎక్బాల్, గ్రామ పంచాయతీ దగ్గర సర్పంచ్ గోపాల్ రెడ్డి,వెటర్నరీ ఆసుపత్రి దగ్గర డాక్టర్ శ్యామ్,రైతు వేదిక లో ఏవో సాజాద్,విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏ ఈ నరసింహ్మ, ఎంఆర్సి కార్యాలయంలో ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, బాలికల ఉన్నత పాఠశాల లో ప్రధానోపాధ్యాయురాలు మంజుల , కస్తూర్బా గాంధీ పాఠశాల లో ఎస్ ఓ హేమలత, పంచాయితీ రాజ్ కార్యాలయం దగ్గర డి.ఈ. చెన్నయ్య, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రాము యాదవ్,తెనుగు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం దగ్గర గెంటీల బుచ్చన్న ,కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ,గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్సై నాగన్న మాట్లాడుతూ మంగళవారం రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సామూహిక జాతీయ గీత ఆలాపన ఉంటుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు,వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు ,పార్టీ నాయకులు,యువకులు పాల్గొన్నారు.
 ప్రత్యేక ఆకర్షణగా మాదవ రావు పల్లి పాఠశాల విద్యార్థులు
మాదవ రావు పల్లి గ్రామ పాఠశాల విద్యార్థులు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర ఉద్యమ నాయకుల వేషధారణతో పలువురు విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరస్వామి , ఉపాధ్యాయులు రవికుమార్, గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు.