పారదర్శకంగా సాంఘిక ఆర్థిక గణన సర్వేప్రణాళికా విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ శివరాంనాయక్‌

శ్రీకాకుళం, జూలై 22 : జిల్లాలో 69వ సాంఘిక ఆర్థిక గణన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ప్రణాళికా విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.శివరాంనాయక్‌ ఆదేశించారు. 6 నెలల కాలంలో ఈ సర్వేను రెండు విడతల్లో చేపట్టాస్సి ఉందని, డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయంలో సహాయ గణాంకాధికారులకు ఒక్కరోజు శిక్షణను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అంశాలతో పాటు ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీటి వసతి, మురికివాడల్లో నివసిస్తున్న ప్రజల జీవన, ఆర్థిక స్థితిగతులను సర్వేచేయాలని ఆదేశించారు. తొలివిడత సెప్టంబరులో పూర్తవుతుందని, ఈ విడతలో తాగునీరు, పారిశుద్ధ్యం, గృహనిర్మాణం తదితర అంశాలు సర్వే చేయాలని, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు గరిగే రండవ విడతలో పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో వివరాల సేకరణ, స్థితిగతులు, మౌళిక వసతులపై సర్వే చేయాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి.రామారావు, గణాంకాధికారులు డి.లక్ష్మణరావు, బి.కృష్ణారావు, కె.మురళీకృష్ట, హనుమంతు నాగభూషనరావు, ఎం.వి.వరహాలరావు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు