పార్టీమారడంతో దక్కిన అదృష్టం

చేవెళ్ల చెల్లమ్మకు మంత్రి పదవి
ప్రాధాన్యం కల విద్యాశాఖ కేటాయింపు
రంగారెడ్డి,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  ఎట్టకేలకు చేవెళ్ల చెల్లెమ్మ మళ్లీ మంత్రపదవి దక్కించుకున్నారు. అంతేగాకుండా ప్రాధాన్యం కలిగిన విద్యాశాఖను దక్కించుకున్నారు.  తనయుడి కోసం గతంలో ఓ మారు పోటీకి దూరంగా ఉన్న సబితా ఇంద్రా రెడ్డి, గత ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ టిక్కెట్‌పై గెలిచారు. ఎక్కడి నుంచి గెలిచినా మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్నారు. కాంగ్రెస్‌ హయాంలో రెండు సార్లు మంత్రిగా పనిచేసిన సబితారెడ్డి ..ఈసారి టీఆర్‌ఎస్‌ నుంచి చోటు దక్కించు కున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె..జిల్లాలో మారిన రాజకీయ సవిూకరణలతో గులాబీ గూటికి చేరారు. భర్త మరణానంతరం 2000లో మొదలైన సబిత రాజకీయ ప్రస్థానంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో చోటుదక్కడం వల్ల రంగారెడ్డి
జిల్లా నుంచి ముచ్చటగా మూడోసారి మంత్రిగా పనిచేస్తున్న ఏకైక మహిళగా సబితారెడ్డి గుర్తింపు సాధించారు. భర్త ఇంద్రారెడ్డి మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సబిత ..2000లో ఉప ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లోనూ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె..చేవెళ్ల చెల్లెమ్మగా వైఎస్‌ ప్రభుత్వంలో గనులు, భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నలుగురు సీఎంలు..అంటే.. వైఎస్సార్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, తాజాగా కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక మహిళ సబితారెడ్డియే. వైఎస్‌ హయాంలో సబితారెడ్డి చేవెళ్ల..చెల్లెమ్మగా గుర్తింపు పొందారు. దేశంలో మొదటిసారిగా మహిళ నేతగా ¬ంమంత్రి పదవి చేపట్టి చరిత్రలోకెక్కారు. భర్త ఇంద్రారెడ్డి మరణనంతరం రాజకీయాల్లోకి వచ్చిన సబితారెడ్డి నాలుగు సార్లు విజయం సాధించారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె పార్లమెంట్‌ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సబితారెడ్డికి ఈ సారి అత్యంత ప్రాధాన్యం ఉన్న  విద్యాశాఖను కేటాయించారు.2004లో చేవెళ్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సబితారెడ్డి.. వైఎస్‌ ప్రభుత్వంలో గనులు, భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.2009 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మరోసారి మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన కేడర్‌ను సంపాదించుకున్నారు. దీంతో మరోసారి వైఎస్‌ హయాంలో సబితకు ¬ంమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. వైఎస్‌ మరణం, రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014ఎన్నికల్లో సబితారెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. మళ్లీ 2018 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో సబితారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లాపై పట్టున్న మహిళా నేతగా సబితకు మంచిపేరు ఉండడం..పార్లమెంట్‌ ఎన్నికల్లో సబిత వర్గం టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడం వల్ల చేవెళ్ల ఎంపీ సీటు టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. దీంతో జిల్లాలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేకుండా పోయింది. కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం మంత్రివర్గ విస్తరణలో సబితారెడ్డికి మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించారు.