పార్థసారథిని పదవి నుండి తొలగించకపోతే న్యాయపోరాటం
విజయవాడ, జూలై 28: కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కె.పార్థసారథిని తక్షణం పదవి నుండి తొలగించకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలుగు దేశం పార్టీ ఎమ్‌ఎల్‌సి వైవి బి రాజేంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. ధరా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆయనకు జైలు శిక్ష పడినప్పటికి, మంత్రి పదవిలోనే కొనసాగించడం ఏ మాత్రం సహేతుకం కాదని అన్నారు. ఒక నేరస్థుడు మంత్రి పదవిలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. దీనిపై వారు కోర్టులో సవాలు చేస్తానని అన్నారు. బి.సి కార్డు అడ్డు పెట్టుకుని మంత్రి ముఖ్యమంత్రిని కూడా బెదిరించి విజయవాడ ఎంపి రాజగోపాల్ అండదండలతో మంత్రి పార్థసారథి పదవిలో కొనసాగుతున్నాడని అన్నారు. ఇది తీవ్రమైన విషయమని, ఈయన వ్యవహారాన్ని పార్టీలన్ని మూకుమ్మడిగా ఖండించాలని రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు.