పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం
ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభలో 183 నిబంధన కింద చర్చ, ఓటింగ్ కోరుతూ స్పీకర్ కోరుతూ స్పీకర్‌కు 20 నోటీసులు అందాయి. బీజేపీ 13, జేడీయూ 2, సీపీఎం 1, సీపీఐ 1, తృణమూల్ కాంగ్రెస్ 1, ఫ్యార్వర్డ్‌బ్లాక్ 1 నోటీసులు సమర్పించాయి. మరోవైపు 168 నిబంధన కింద చర్చ కోరుతూ తెదేపా రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీసు అందించారు. ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం కోరుతూ స్పీకర్ మీరాకుమార్‌కు తృణమూల్ కాంగ్రెస్ నోటీసు సమర్పించింది. సభ ప్రారంభం కాగానే నూతనంగా సభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఇటీవల మరణించిన లోక్‌సభ సభ్యుడు ఎర్రన్నాయుడు, శివసేన అధ్యక్షుడు బాల్‌ధాకరేతో పాటు పలువురు ప్రముఖులకు పార్లమెంటు సభ్యులు సంతాపం తెలియజేశారు.