పాలకుల నిర్లక్ష్యం తో అలంపూర్ పట్టణానికి వరద ముప్పు

 అలంపూర్ ఆగస్టు  జనంసాక్షి                    పాలకులు వరదల నివారణకు  శాశ్వత పరిష్కారం  చేయకుండా నిర్లక్ష్యం చేయడం  కారణంగానే అలంపూర్ పట్టణానికి వరద ముప్పు వస్తుందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం  పట్టణంలోని వరద ముంపుకు గురైన ప్రాంతాలైన అక్బర్ పేట,6,7 వార్డులలో బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలతో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా  కాలనీవాసులు ఆయనాను ఆప్యాయంగా పలకరించి సమస్యలను, వారికి జరిగిన నష్టాలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 2009 సంవత్సరం లో వచ్చిన వరదలకు తీవ్రస్థాయిలో నష్టపోవడంతో ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపే విధంగా 45 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇప్పటివరకు కొంతమందికి స్థలాల కేటాయించక పోవడంతో పాటు కొందరికి పట్టాలు ఇవ్వకుండా అధికారులు,పాలకుల నిర్లక్ష్యం కారణంగానే అలంపూర్ ప్రాంతానికి ప్రతి సంవత్సరం వచ్చే వర్షాలకు  వచ్చే వరదలకు ప్రతి సంవత్సరం పట్టణ వాసులకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇక్కడి నాయకులకు ప్రజల కష్టాలు వారి వారికి కనిపించవా అని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులకు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకుండా వల్లే ప్రతి సంవత్సరం నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. అక్బర్ కాలనీలో అధికారులు నాయకులు కుమ్మకై సి సి రోడ్డు వేసినప్పటికీ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం కారణంగానే వరదలకు ఇళ్లలోకి నీరు వచ్చి తీరుతుందని ఆయన అన్నారు. అంతే కాకుండా ప్రసాద్ స్కీం లో భారీ అవకతవకలు జరిగాయని, అవకతవకలపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో సమాజ్ పార్టీ అధికారంలోకి రావడం కాయం బహుజన రాజ్యం లో అలంపూర్ పట్టణానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన అన్నారు.