పాలకుల విధానాలు ఎండ గట్టండి

కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్.
హుస్నాబాద్ ఆగస్టు 09(జనంసాక్షి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు.
మంగళవారం నాడు హుస్నాబాద్ సిపిఐ మండల మహాసభ పోదిల కుమారస్వామి అధ్యక్షుతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథి పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల పేద,మధ్యతరగతి ప్రజలు అనేక విధాలుగా నష్టపోతున్నారని అన్నారు.
సిపిఐ మహాసభల జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులు,
కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్,   జాగీర్ సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొహెడ కొమురయ్య, అయిలేని సంజివరెడ్డి, ఏగ్గొజు సుదర్శన్ చారి, సిపిఐ కొహెడ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్,ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్, ఎఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె సుజిత్ కుమార్, సిపిఐ మండల నాయకులు పోదిల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
4వ సారి మండల కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గడిపె మల్లేశ్.
హుస్నాబాద్ మండల కార్యదర్శిగా 4వ సారి ఏకగ్రీవంగా హుస్నాబాద్ పట్టణం కు చెందిన మాజీ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గడిపె మల్లేశ్ ను 21 కౌన్సిల్ సభ్యులు,11మంది కార్యవర్గ కార్యకర్తలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.