పాలమూరు ప్రాజెక్ట్ లపై కెసిఆర్ సవితి తల్లి ప్రేమ………..

నాగర్ కర్నూల్ బ్యూరో అక్టోబర్ 6 జనం సాక్షి…..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాసిరకంగా పనులు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జనసేన ఇంజనీర్ల ఫోరం నాయకులు మండిపడ్డారు. ఆదివారం నాడు నియోజకవర్గంలోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ పనులను వారు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కెసిఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పట్ల సవతి ప్రేమ చూపిస్తున్నారని తెలంగాణ జన సమితి పార్టీ ఇంజనీరింగ్ ఫోరం అధ్యక్షుడు రమేష్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజు
తెలంగాణ జన సమితి నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జన సమితి పార్టీ ఇంజనీరింగ్ ఫోరం అధ్యక్షుడు రమేష్ రెడ్డి నాగర్కర్నూల్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాం ప్రసాద్ రెడ్డి  వట్టెం రిజర్వాయర్ ప్యాకేజ్ 9 ,ప్యాకేజ్ 11పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయాన ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పర్యటించిన ప్రాంతమే, వర్షాలకు కూలిపోవడ మంటే ప్రాజెక్టులో నాణ్యతా లోపానికి నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్టు అనుకున్న స్థాయిలో పనులు జరగడం లేదని, నాణ్యత లోపించిందని, పాలమూరు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కెసిఆర్ అధికారం చేపట్టి , అన్ని ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించి ,పాలమూరు రంగారెడ్డి బ్యాలెన్సింగ్ ప్రాజెక్టులకు మాత్రము తక్కువ నిధులు కేటాయిం చడం, పాలమూరు పై సమితి ప్రేమ చూపించడం సరికాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ కు ఒక న్యాయం, మహబూబ్నగర్కు ఒక  న్యాయమా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రాంతాల మధ్య వివక్షత చూపడం సరికాదని  ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మిడ్ మానేరు కట్ట కుంగిపోవడం జరిగిందని, ఇక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని లేకుంటే అక్కడి ఇలాగే ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని సూచించారు. అక్కడి  నిర్వాసితులకు అనుకున్న స్థాయిలో న్యాయం జరగలేదని, వాళ్లకు న్యాయం జరగాలని, వాళ్లకు న్యాయం జరిగే వరకు జనసమితి పోరాటం చేస్తుందని తెలిపారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం చేసిన విధంగా ఈ యొక్క వట్టెం ముంపు బాధితులకు కూడా  న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పర్యవేక్షణలో అనుకున్న స్థాయిలో పనులు జరగడం లేదని, ఐదు వందల కోట్లు మాత్రమే ఈ  బాలెన్సింగ్ ప్రాజెక్టు పనులకు నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.ఈ లెక్కన పనులను కొనసాగిస్తే 70 సంవత్సరాలు పడుతుందని సంవత్సరంలో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ,నీళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఐదు వందల కోట్లు కేటాయించడం ఏంటని  ప్రశ్నించారు.  మాయ మాటలతో మోసం చేయడం ఆపేసి, ఆపాలని ఈ ప్రాజెక్టు లో నాణ్యత పాటించాలని, నిర్వాసితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ గుప్తా, ఇంచార్జ్ రాములు గౌడ్, బిజినపల్లి మండల అధ్యక్షుడు భీమ్ సాగర్ ,జన సమితి నాయకులు నాగిరెడ్డి, నవీన్, రుత్విక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.