పాలమూరు యూనివర్సిటీ లో ఈ నెల 23న ఫ్రీ సింపోజియం
మహబుబ్ నగర్ అర్ సి ,అక్టోబరు 11,(జనంసాక్షి ):
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం లో అర్థశాస్త్రం ,వాణిజ్య శాస్త్రం మరియు ఐ క్యూ ఏ సి అధ్వర్యంలో ఈనెల 23న తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ ఫ్రీ సింపోజియం నిర్వహించనున్నట్లు పియు విసి తెలిపారు . ఈ సందర్భంగా ఫ్రీ సింపోజియం కు సంబంధించిన గోడ పత్రికను వారు విడుదల చేశారు .ఈ కార్యక్రమంలో పి యు వి సి ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గిరిజా మంగతాయారు ,టి ఈ ఏ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ముత్యంరెడ్డి ,జనరల్ సెక్రెటరీ ప్రొఫెసర్ వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ రాజ్కుమార్, వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ అనురాధ ,డాక్టర్ రాఘవేందర్ ,గాలెన్న ,డాక్టర్ జెమ్మి కాటన్ పాల్గొన్నారు.