ఖమ్మం: పాలేరు ఉపఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలు ముగిసేసరికి 75.10 శాతంగా నమోదైంది. ఉదయం పోలింగ్ ప్రారంభం నుంచి ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండటంతో ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.