పాలేరులో టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచారం

ktr@paleru-650x345కాంగ్రెస్‌,కమ్యూనిస్టుల వల్లనే వెనకబాటు
అభివృదద్‌ఇ చేసే సత్తా తుమ్మలకు ఉందన్న మంత్రి కెటిఆర్‌
నియోజకవర్గాన్ని ఆదర్వంగా తీర్చిదిద్దుతానన్న తుమ్మల
ఖమ్మం,మే7(జ‌నంసాక్షి):  దశాబ్దాలుగా పాలేరు నియోజకవర్గం వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు ఉపఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలని మంత్రి కేటీఆర్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు.  పాలేరు నియోజకవర్గం వెనుకబాటుకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలే కారణమని విమర్శించారు. దశాబ్దాలుగా నియోజకవర్గం వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజవర్గ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నేలకొండపల్లి మండలం బోదులబండలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు లాఠీ దెబ్బలు తిన్న ఠగనలు అప్పుడే ఎలా మరచిపోగలమని అన్నారు. కరెంట్‌ కోసం సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు చేసిన విషయాలను ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారని అన్నారు.  తలాపున పాలేరు రిజర్వాయర్‌ ఉన్నా కూడా కూసుమంచి, తిరుమలాయోపాలెం మండలాలకు దశాబ్దాలుగా సాగునీరందడంలేదు. సాగునీటి కలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్‌ భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని తెచ్చారు. పాలేరు పాత కాల్వను ఆధునీకరించి చెరుకు రైతాంగాన్ని ఆదుకుంటామని అన్నారు.

టిఆర్‌ఎస్‌ అబ్యర్థి, మంత్రి తుమ్మల మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో ఏడాదికి లక్ష చొప్పన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కట్టించి తీరుతామని మున్సిపల్‌,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో జరిగిన ఎన్నికల సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. అరవై ఏళ్లలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు చేయలేని అభివృద్ధిని పాలేరు నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అవకాశమిస్తే మూడేళ్లలో చేసి చూపిస్తామని అన్నారు. భక్తరామదాసు సాగునీటి పథకం ద్వారా తిరుమలాయపాలెం మండలంతో పాటు నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్‌ మండలాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కారుగుర్తుకు ఓటు వేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో ఏడాదికి లక్ష చొప్పన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించి తీరుతామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హావిూ ఇచ్చారు. పేదలకు ఇల్లు నేనే కట్టిస్తా ఆడపిల్లల పెండ్లి ఖర్చు నేనే ఇస్తానని చెప్పిన దేశంలో ఏకైక సీఎం కేసీఆర్‌ అని పాలేరు టిఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి తుమ్మల తెలిపారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు రూ.5 లక్షలు, కల్యాణలక్ష్మి కింద

రూ.51వేలు ఆడపిల్లకు ఇస్తున్న విషయాన్ని తెలిపారు. రాష్ట్రలో ఎలాంటి రేషన్‌ లేకుండా కుటుంబంలో ఎంతమంది ఉన్నా  ఓక్కొక్కరికి ఆరు కేజీల బియ్యం ఇస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు. విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్న కేసీఆర్‌దని వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో రైతన్నలు విత్తనాలు, ఎరువులు దొరక్క, కరెంటు లేక అనేక ఇబ్బబందులు పడేవారని తెలిపారు. టీఆరఎస్‌ ప్రభుత్వ హయంలో రైతుల కష్టాలన్ని తొలిగిపోయినట్లు తెలిపారు. ఎన్నికల హావిూ మేరకు ఇచ్చే తొమ్మిది గంటల కరెంటు పగటిపూటే ఇస్తామని హావిూ ఇచ్చారు. ప్రతి రైతుకు రూ.లక్ష రుణమాఫీ పక్రియ మరో విడతతో పూర్తి అవుతుందని వివరించారు. ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రోత్సహించేందుకు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావును విజ్ఞప్తిచేశారు. తాను గెలిస్తే విూ పాలేరును మోడల్‌గా అభివృద్ధి చేసితీరుతారని చెప్పారు. పాలేరు నుంచి కృష్ణ జలాలను తరలించి నేలకొండపల్లి మండలంలోని సాగర్‌ ఆయకట్టు రైతులకు అన్యాయం చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూస్తుందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధాలకోరు ప్రచారాన్ని మానుకోవాలని  తుమ్మల నాగేశ్వరావు అన్నారు. గోదావరి జలాలను తీసుకొచ్చి పాలేరు రిజర్వార్‌ను నింపి కృష్ణ గోదావరి జలాల ద్వారా అన్ని ప్రాంతాలకు సంపూర్ణంగా సాగుతాగు నీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. తాను మంత్రి పదవి చేపట్టగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు శ్రీభక్తరామదాసు, శ్రీసీతారామ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చేతులవిూదుగానే పనులు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో గెలిచిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాల వల్లనే పాలేరు నియోజకవర్గం వెనకబాటుకు గురైందని ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌, కమ్యూనిష్టులను అనేక మార్లు గెలిపించినప్పటికి వారు ఏవిూ చేయలేకపోవడం వల్ల ఈ ప్రాంతం కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మంత్రి తుమ్మల అభివృద్ధికి, నీతినిజాయితి మారుపేరని చెప్పారు. నాతోపాటు వైసీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారంతా తుమ్మల నాగేశ్వరావు విజయానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్‌ సాగు, తాగునీటి పథకాలకే మొదటి  ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. నియోజకవర్గానికి సేవచేసే అవకాశం గతంలో లేదని, ఇప్పుడు విూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రూపురేఖలు మారుస్తాడన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో ఉంచిన ఘనత పథకాన్ని రానున్న మూడు సంవత్సరాల్లో ప్రతిఇంటికీ తాగునీరు ఇవ్వలేకపోతే ఓట్లు అడగనని ప్రతిజ్ఞ చేసిన ఏకైక సీఎం కేసీఆర్‌ ఒక్కడే అని కొనియాడారు.  నియోజక వర్గంలోని కార్మిక, కర్షక, దళిత, హరిజనులతో పాటు అన్ని వర్గాల మద్దతు మంత్రి తుమ్మలకే ఉందని, ఎవరూ మెజార్టీతో గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.   తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి, కృష్ణా నదులపై వంతెనలు నిర్మిస్తుంటే ఆంధ్రా పాలకుల అడ్డుకోవడం సరికాదన్నారు. కుట్రలు సీఎం కేసీఆర్‌ మందు బలాదూర్‌ అని విమర్శించారు. ఎన్ని కుట్రలు, కుంత్రాలు పన్నినా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అనుకున్న ప్రాజెక్టులు కట్టితీరడం ఖాయమన్నారు.  తెలంగాణ కూడా సీఎం కేసీఆర్‌తో శుభపరిణామమన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల వల్ల బడుగ, బలహీన వర్గాల ప్రజలకు గామానికి ఇప్పటికే ఇంకా ఇచ్చేందుకు సిద్ధమన్నారు. సాధించుకున్న తెలంగాణ తెలంగాణగా తీర్చిదిద్దాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో గల బీడు భూములకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తుంటే ఆంధ్రా

సీఎం చంద్రబాబు, పతిపక్షనేత జగన్‌లు అడ్డుకుంటామంటూ చేయడంతో తెలంగాణ బిడ్డగా నా మనస్సు చలించి సాధకుడు సీఎం కేసీఆర్‌ చేరానని పొంగులేటి అన్నారు. ఆంధ్రాపార్టీలకు ఇక తెలంగాణలో మనుగడ లేదన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు మంత్రి తుమ్మల సహకారంతో సీతారామ, చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పాలేరు ఎన్నెస్పీ కింద ఉన్న భూములకు కూడా సీతారామ ఎత్తిపోతల పథకం కింద నీళ్లు ఇస్తామన్నారు. అభివృద్ధి ప్రదాత మంత్రి తుమ్మలను అఖండ మెజార్టీతో గెలిపించాలని, ముఖ్యంగా వైసీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కార్యకర్తలందరూ కారు గుర్తుకే ఓట్లు పడేవిధంగా కృషి చేయాలన్నారు.

తాజావార్తలు