పాలేరులో ప్రచారం ప్రారంభించిన తుమ్మల

KHAMMAM-RALLY-VSLS-01

ఖమ్మం జిల్లా పాలేరులో టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ఒకటో డివిజన్ కైకొండాయిగూడెం, రామన్నపేట, దానవాయిగూడెం, దానవాయిగూడెం కాలనీలో ప్రచారం చేశారు.

అభివృద్ధికి, అనైతిక పొత్తులకు మధ్య సమరం పాలేరు ఉప ఎన్నిక అన్నారు తుమ్మల. కాంగ్రెస్ పాలనలో పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ ను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ తో జతకట్టడం దివాళాకోరుతనమని తుమ్మల విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ కూటమికి వైసీపీ జతకట్టడం రాజకీయ చరిత్రలోనే పాలేరు నియోజకవర్గం వేదికైందన్నారు. తన విజయం నల్లేరు మీద నడకేనని తుమ్మల ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి తుమ్మల వెంట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు.