పిల్లలందరికీ ఆల్బొండా జోల్ మందులను వేయాలి

ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి
*******
సైదాపూర్ జనం సాక్షి : సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపల ఉన్న చిన్నారులకు, విద్యార్థులకు, యువతి, యువకులకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మందులను వేయాలని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి కోరారు. గురువారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని అంగన్వాడి కేంద్రంతోపాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు ఆయన ఆల్బెండజోల్ గోలీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చిన్నారులు మట్టిలో ఆడడం, గోళ్లు ఉండటంతో పాటు అపరిశుభ్రంగా ఉండడం ద్వారా కడుపులో నులిపురుగులు తయారవుతాయని తద్వారా పిల్లలకు ఆకలి మందగించి రోగాల బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, మెడికల్ సిబ్బంది సహకారంతో తప్పనిసరిగా వారి విద్యాసంస్థల్లో ఆల్బెండజోల్ గోలీలను ప్రతి విద్యార్థికి వేయాలన్నారు. ప్రభుత్వం చిన్నారులకు సరిపడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి,సబ్ సెంటర్లకు మందులను అందించిందని తెలిపారు. చిన్నారులకు యువతి, యువకులకు ఆల్బెండజోల్ గోలీలను పంపిణీ చేయని ఏరియాలో ని ఆరోగ్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాయిత రాములు, ప్రధానోపాధ్యాయురాలు కవిత,ఉప సర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, ఏఎన్ఎం ఇందిరా,అంగన్వాడి టీచర్ స్వరాజ్యం, సింగిల్ విండో డైరెక్టర్ దోనపాటి రామ్ రెడ్డి,వార్డు సభ్యులు రేగుల సురేష్, ఆశ కార్యకర్త నిర్మల, విద్యా వాలంటరీ అనూష తదితరులు పాల్గొన్నారు.