పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ధ్యేయం

నగర్ అక్టోబర్ 15 (జనం సాక్షి): పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ధ్యేయమని ఎం డి ఆర్ స్కూల్ చైర్మన్ మేరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని ఎండిఆర్ స్కూల్ నందు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ మరింత మెరుగు పరిచే విధంగా ఉపాద్యాయులు పాలుపంచుకోవలన్నారు. ఉపాద్యాయులు కూడా పిల్లల అభివృద్ధి కోసం కచ్చితంగా తమ వంతు కృషి చేస్తామని తల్లిదండ్రుల కు హామీ ఇచ్చారు. వర్షంలో కూడా దాదాపుగా 90 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు పాల్గొని తమ పిల్లల ప్రోగ్రెస్ కార్డులను అందుకొని తమ పిల్లల మార్కుల జాబితాను తెలుసుకొని సంతకాలు చేసి పిల్లల భవిష్యత్తు మరింత మెరుగుపరిచే విధంగా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నలబోలు భూపాల్ రెడ్డి, ఉపాద్యాయునీ, ఉపాద్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.