పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యయత్నం
వరంగల్: ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన వరంగల్ జిల్లాలో ఈరోజు జరిగింది. జఫర్‌గడ్ మండలం వడ్డెగూడెంలో కుటుంబకలహాలతో విసిగిపోయిన ఓ తల్లి ఇద్దరు పిల్లలకు పురుగుమందు తాగించి తానూ తాగింది. వీరిని చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు.