పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాల పంపిణీ

హుజూర్ నగర్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి):
హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఓజో ఫౌండేషన్ అధినేత  పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గా   మాత విగ్రహాల బహుకరణ   ఆదివారం కన్నుల పండుగలా  జరిగిందని ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్చార్జి కుక్కల వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పిల్లల నుంచి పెద్దల వరకు కలిసిమెలిసి చేసుకునే బతుకమ్మ సంబరాలు మొదలు కానున్నాయని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 25 న ప్రారంభమై అక్టోబర్ 5 వరకు ఈ పండుగ జరుగుతుందని మహిళలు, యువతులు, బాలికలకు ఎంతో ఇష్టమైన ఈ పండుగలో తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తారని, ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ,  పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండగ వచ్చి భూమి, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటారని అన్నారు. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిదిరోజుల పాటు ఆటపాటలతో పూలను నీటిలో వదులుతారని తెలిపారు.
బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఓజో ఫౌండేషన్ ఇన్చార్జ్  కుక్కల వెంకన్న, నాగుల్ మీరా, శివ శంకర్ యాదవ్, నాగు నాయక్,  వెంకటేష్ నాయక్, నక్కని నరేష్ , సాయిబాబా, సైదిరెడ్డి, శ్రీకాంత్,  సైదులు ముదిరాజ్, మహేందర్ రెడ్డి , వెంకన్న, సాయి, నాగరాజు, ఓజో ఫౌండేషన్ ప్రతినిధులు మండలి సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.