పీఎస్‌ఎల్‌వీ-సి30 ప్రయోగం విజయవంతం

3ltt2q2i ‘ఆస్గోశాట్‌’తో సహా ఏడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన రాకెట్‌
హైదరాబాద్‌: అగ్రరాజ్యాల సరసన భారత్‌ను నిలపాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన ‘అస్గోశాట్‌’ ఉపగ్రహాన్ని భారత్‌ ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి పొలార్‌ శాటిలైట్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ)-సి30 రాకెట్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
పీఎస్‌ఎల్‌వీ-సి30 నుంచి ఇస్రోకు చెందిన ఆస్గోశాట్‌(1513 కిలోలు) ఉపగ్రహంతో పాటు ఇండోనేషియా లాపాన్‌-2(68 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్‌యా(5.5) యూఎస్‌కు సంబంధించిన లెమర్‌-2, 3, 4, 5(16కిలోలు) ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సి30 నింగిలోకి తీసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఉపగ్రహాల మొత్తం బరువు 1,630 కిలోలు.ఖగోళ పరిశోధనల కోసం తొలిసారి చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి.
ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్థ్‌|న్‌ శనివారం ఉదయం 8 గంటల నుంచి నిరంతరాయంగా కొనసాగింది. కౌంట్థ్‌|న్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇండోనేషియా, కెనడా, అమెరికా దేశాల ఉపగ్రహాలను నింగిలోకి పంపడంతో ఆ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు షార్‌కు చేరుకుని ప్రయోగాన్ని వీక్షించారు.
ఆస్గోశాట్‌ విశేషాలు..
– ఖగోళ పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన తొలి ఉపగ్రహం

– ఈ ఉపగ్రహంతో విశ్వం మూలాలు తెలుసుకునే ప్రయత్నం

– రేడియోధార్మికత తీరు, రోదసి వాతావరణం అంశాలపై శోధన

– గ్రహాలు, నక్షత్ర మండలాలపై పరిశోధన

– ఐదేళ్ల పాటు సేవలు