పీ హెచ్ సి అప్గ్రేడ్ తో మరింత వైద్యసేవలు

టేకులపల్లి ,జూన్ 7( జనం సాక్షి ):  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులా నగర్ వైద్య కళాశాలకు అనుబంధంగా రూరల్ మెడికల్ సెంటర్ గా అప్గ్రేడ్ చేయడంతో మండలంలోని ప్రజలకు మరింత మెరుగ్గా వైద్య సేవలను అందించవచ్చని  భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ ఎల్ లక్ష్మణ్ రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మోకాళ్ళ వెంకటేశ్వరరావు అన్నారు.  సులా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలకు జరిగిన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా రూరల్ మెడికల్ సెంటర్ గా అప్గ్రేడ్ చేయడం వాన  మండలంలోని రోగులకు విస్తృతమైన సేవలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆశా కార్యకర్తల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరారు. ముఖ్యంగా వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు టైఫాయిడ్ వాంతులు విరోచనాలు కామెర్లు తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ, సత్యవతి ,గుజ్జ విజయ, శకుంతల, పోరండ్ల శ్రీనివాస్, నాగుబండి వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.