పుట్టువెంట్రుకల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శాసనంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి): హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయిని గూడెం 28 వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన గంగరాజు ఏకైక పుత్రిక అమరబోయిన రిషిక యొక్క పుట్టువెంట్రుకల మహోత్సవ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ శాసన సభ్యులు శాసనంపూడి సైదిరెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ టి ఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, ప్రధాన కారదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, కౌన్సిలర్ లు కొమ్ము శ్రీను, జక్కుల శంభయ్య, గుండా ఫణి రామ్ రెడ్డి, మహిళా నాయకురాలు శ్రీపాద అర్చన దేవి, ప్రజా ప్రతినిధులు, వివిధ కమిటీల నాయకులు, యువజనులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.