పుట్ట మదన్న ను మళ్లీ ఆశీర్వదించాలి
-ఆసరా పింఛను లబ్ధిదారులను కలిసి లేఖను అందిస్తూ వినూత్న రీతిలో ప్రచారం షురూ !
మల్హర్ సెప్టెంబర్ 26,(జనంసాక్షి) ;
మండలంలోని మల్లారం లో టిఆర్ఎస్ నాయకులు జెడ్పిటిసి శ్రీనివాసరావుతెరాస మండల అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్ వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం షురూ చేశారు .ఆసరా పింఛను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ రాసిన లేఖను లబ్ధిదారులకు అందిస్తూ పుట్ట మదన్న ను మళ్లీ ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ప్రస్తుతం అందిస్తున్న ఆసరా పింఛను ఎంతో కొంత ఆర్థిక ఉపశమనాన్ని కలిగించిందని మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు వీటితో పాటు మరిన్ని సంక్షేమ పథకాల రూపకల్పన చేసే పనిలో ముఖ్యమంత్రి ఉన్నాడని రాబోవు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తే పింఛను మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చెప్యాల రామారావు మాజీ ఉపసర్పంచ్ ప్రకాష్ రావు తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు సుంకు రామన్న డిష్ సమ్మయ్య మధు బండారి సంపత్ బాపూరావు శ్రీనాథ్ పాల్గొన్నారు