పురాతన ఇండ్లను ఖాళీ చేయండి. ప్రమాదం పొంచి ఉంది
జూలై 14 జనం సాక్షి:-మండల కేంద్రంలో గత ఎనిమిది రోజులుగా కురుస్తున్న వర్షానికి పురాతన పెంకుటిల్లు కులిపోతున్నయి.ఈ సందర్భంగా గురువారం స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్,స్థానిక సింగిల్ విండో ఛైర్మెన్ కూచి సిద్దు గ్రామంలో కులిన ఇండ్లను పరిశీలించారు.అనంతరం కూలిన ఇంటి కుటుంబీకులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని బరోసాను ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రభుత్వ గదుళ్ళల్లో సహయార్దులకు షల్టర్ను ఏర్పాటు చేశారు.అదేవిధంగా రెడ్ క్రాస్ వారి తరుపున పెంకుటిల్లు,రేకుల ఇండ్ల పైకప్పు నుండి నీరు ఊరుతున్న కుటుంబీకులకు రక్షణగా టార్పాలిన్ పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటు,ఎలాంటి సమస్యలు తలెత్తిన తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలక వర్గం,రెడ్ క్రాస్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Attachments area



