పురుగుమందులు విక్రయిస్తున్న వారికి కఠిన చర్యలు
జనంసాక్షి రాజంపేట్
మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామం లో వ్యవసాయ అధికారిని జోష్ణ ప్రియదర్శిని తనిఖీలు చేపట్టారు లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్న పురుగుమందులు గుర్తించారు. గత కొంత కాలంగా రైతులకు రహస్యంగా అమ్ముతున్న డీలర్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆ దుకాణంలో ఉన్న పురుగుమందులను స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారిని మాట్లాడుతూ ఇలాంటి చర్యలపై పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.అలాగే ఈ విషయం మీద పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. మరియు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 11923 ఇట్టి సరుకును సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులకు కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు. కాబట్టి రైతులు సహకరించి ఎక్కడైనా లైసెన్సులు లేకుండా ఇళ్లలో పెట్టుకొని అమ్మిన వారి సమాచారం మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కు తెలుపాలని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు గమనించగలరు ప్రభుత్వం చే లైసెన్సులో పొందిన షాపుల్లో మాత్రమే అన్ని రకాల మందులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆ షాపు యందు తీసుకున్న వస్తువుకు బిల్ తీసుకొని ఉండాలని రైతులకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రైతులకు అటు ప్రభుత్వానికి మధ్యలో ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన డీలర్ పురుగుమందుల బాధ్యతలను పూర్తిగా బాధ్యుడు కాబట్టి రైతులు లైసెన్స్ ఉన్న షాపుల్లో మాత్రమే పంట పొలాలకు సంబంధించిన వస్తువులను పురుగుమందులను కొనాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ జోష్ణ ప్రియదర్శిని చెప్పడం జరుగుతున్నది.