పురుగుమందుల మరియు ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ
అయిజ, సెప్టెంబర్ 21 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం సక్రియ నాయక్ మరియు ఐజ మండల వ్యవసాయ అధికారి ఎస్ శంకర్ లాల్ ఆధ్వర్యంలో ఐజ మండలంలోని వెంకటపురం స్టేట్ నందు గల పురుగు మందుల దుకాణాలు అయిన శ్రీ ఆంజనేయ ట్రేడర్స్, గాయత్రి ఫర్టిలైజర్స్, శ్రీ శ్రీనివాస ఫెర్టిలైజర్స్ మరియు మహాలక్ష్మి ట్రేడర్స్ తదితర దుకాణాల లో ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దుకాణదారులకు ఏ డి ఏ రసాయన ఎరువులను ఈ పాస్ యంత్రం ద్వారానే క్రయవిక్రయా లు జరపాలని మరియు ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని డీలర్లను ఆదేశించారు అదేవిధంగా పురుగుమందులను అనుమతి లేకుండా విక్రయించరాదని లైసెన్సులో పొందుపరిచిన కంపెనీల యొక్క పురుగుమందులను మాత్రమే ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని ఆదేశించారు.అనంతరం కిసాన్ అగ్రిమాల్ దుకాణంలో పురుగుమందులను తనిఖీ చేయడం జరిగింది.దానిలో ఎలాంటి అనుమతి లేకుండా ఉన్నటువంటి 1,38,200 విలువగల పురుగుమందులను రైతులకు అమ్మకుండా నిలుపుదల చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఏడిఏ గారు అందరూ డీలర్లకు పురుగుమందులు మరియు ఎరువులు అనుమతి లేకుండా అమ్మినట్లయితే అట్టి డీలర్ల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఏడిఏ తో పాటు స్థానిక వ్యవసాయ అధికారి శంకర్ లాల్ పాల్గొన్నారు.