పుస్తకాలు చదవడం దినచర్యలో ఒక భాగం కావాలి జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి మొండి గౌరెల్లి గ్రామంలో సాధన విలేజ్ లైబ్రరీ ప్రారంభం


జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి

మొండి గౌరెల్లి గ్రామంలో సాధన విలేజ్ లైబ్రరీ ప్రారంభం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 07 (జనం సాక్షి) పుస్తకాలను చదవడం ద్వారా మంచి చెడు జ్ఞానం సమస్త విషయాలు తెలుస్తాయని అంతకుమించిన మంచి మిత్రుడు ఈ లోకంలో ఎవరు లేరని జ్ఞానసరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదావెంకట్ రెడ్డి అన్నారు. యాచారం మండల పరిధిలోని మొండి గౌరెల్లి గ్రామంలో సాధన విలేజ్ లైబ్రరీ నూతన ఆవిష్కరణ కార్యక్రమాన్ని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి ఏర్పాటు చేశారు. సదా వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటుచేసిన గ్రంథాలయంలో బాలలకు ఉపయోగపడే బాలసాహిత్యం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యువకులకు కాంపిటీటివ్ టెక్స్ట్ పుస్తకాలు గ్రంథాలయంలో అవసరమయ్యే పరికరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
వాటిని సద్వినియోగం చేసుకోవాలని పుస్తకాలు కేవలం ఉద్యోగ సాధన కోసమే కాకుండా జీవితాన్ని సాధించడానికి చదవాలిఅని  అదొక అద్భుత సాధనగా మన దినచర్యలో ఒక భాగంగా పుస్తక పఠనం చేయాలని అన్నారు. 2014 సంవత్సరం నుండి ఈ గ్రంథాలయాల కోసం జ్ఞాన సరస్వతి  ఫౌండేషన్ విశేష ప్రయత్నం చేస్తుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అవసరమైన పుస్తకాలతో పాటు దేశ చరిత్ర, రాష్ట్ర చరిత్ర పుస్తకాలు మరియు బాలలకు ఉపయోగపడే విధంగా బాలసాహిత్యం కూడా ఈ గ్రంథాలయoలో ఉంటుంది. ముఖ్యంగా బాల సాహిత్యంతో 2014-15 సంవత్సరాలలో సంచార గ్రంథాలయం 5 గ్రామాలలో గ్రంథాలయాలలో  ఏర్పాటు కూడా జరిగింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు ప్రతి గ్రామంలో సుమారు 20 నుండి 40 మంది వరకు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నరు గ్రంధాలయం నిర్వహణలో 5 గురు నిర్వహణ సభ్యులుగా ఉండనున్నారు ఒక్కో గ్రామానికి సుమారు 75 వేల రూపాయల ఖర్చుతో సామాగ్రి అందజేయడం జరిగిందని తెలిపారు. బాలలు విద్యార్థులు యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రగతి స్పెషల్ ఆఫీసర్ నర్సింహా ఉపసర్పంచ్ మేకల యాదగిరి రెడ్డి బీజేపీ మండలాధ్యక్షులు తాండ్ర రవీందర్ బీఎస్పీ మండల కన్వీనర్ గొడుకొండ్ల ప్రవీణ్ ఎస్ ఎం సి చైర్మన్ కట్టెల ఆంజనేయులు ఉపాధ్యాయులు కొంగర జంగయ్య. మర్రిపల్లి మహేష్,కట్టెల రమేష్, వస్పరి మల్లేష్, పెండ్యాల మహేష్, గ్రామ యువజన సంఘాల సభ్యులు గుడాల వెంకటేష్ గడ్డం లింగం శశిధర్ గ్రంథాలయ నిర్వహణ కమిటీ సభ్యులు గడ్డం రాజశేఖర్ మంతాపురం లోకేష్ నక్క మధు బొడ్డు అనిల్  తదితరులు పాల్గొన్నారు.