పుస్తె మట్టెలు వితరణ చేసిన కొత్త చక్రపాణి గౌడ్ మేడిపల్లి – జనంసాక్షి
నూతన గౌడ సంఘం సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పటేల్ వెంకటేష్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి విజయ్ గౌడ్ ఆధ్వర్యంలో కాసుల నర్మద శ్రీనివాస గౌడ్ కూతురు వినుతా గౌడ్ వివాహానికి బోడుప్పల్ తెరాస సీనియర్ నాయకుడు కొత్త చక్రపాణి గౌడ్ (ధాత) చేతుల మీదగా బంగారు పుస్తే మట్టెలను సంఘం తరపున బహూకరించారు. ఆర్గనైజర్ బత్తుల రవీందర్ గౌడ్ పట్టు వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా వధువుకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొరిగాడి ఉపేందర్ గౌడ్, ఆర్గనైజర్ బత్తుల రవీందర్ గౌడ్, మల్కాజిగిరి- మేడ్చల్ జిల్లా మచ్చ శ్రీనివాస్ గౌడ్, కనకటి భాస్కర్ గౌడ్, మిట్టపల్లి మహేష్ గౌడ్, చెరుకు ఎల్లయ్య గౌడ్, సుబ్బారావు, పాల్గొన్నారు.