పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

తీరనున్న పాలమూరు మంచినీటి సమస్యలు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఎన్నో ఏళ్ల తాగునీటి ఇబ్బందులు మిషన్‌ భగీరథతో తొలుగుతాయి. పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థ మొత్తంగా ఆధునికీకరిస్తారు. గ్రావిూణ నీటి సరఫరాలశాఖ పర్యవేక్షణలో ఇక నుంచి నీటి సరఫరా జరుగుతుంది. మొత్తంగా పాలమూరు పురపాలికలో తాగునీటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి.మిషన్‌ భగీరథ పథకం అమలుతో పాలమూరు పురపాలక సంఘానికి తలనొప్పులు తగ్గనున్నాయి ప్రస్తుతం పట్టణానికి రామన్‌పాడ్‌, కోయిలసాగర్‌ పథకాల ద్వారా నీళ్లు సరఫరా అవుతున్నాయి. మిషన్‌ భగీరథ అమలుతో ఈ విద్యుత్‌ బిల్లుల భారం కూడా తగ్గనుందని అంచనా వేస్తున్నారు. అలాగే 14 ట్యాంకులు నిర్మించి వాటికి 300 కిలోవిూటర్ల పొడవునా పైపులైన్లు అనుసంధానం చేస్తాం. మిషన్‌ భగీరథతో పురపాలికకు రామన్‌పాడ్‌, కోయిల్‌సాగర్‌ నీటి సరఫరా పథకాల ద్వారా నెలకు వచ్చే విద్యుత్‌ బిల్లుల భారం పూర్తిగా తగ్గుతుంది. దీంతో పట్టణంలో తాగునీటి పైపులైన్ల విస్తరణ, జలాశయాల నిర్మాణం వంటి పనులు చేపట్టబోతున్నారు. ఈ యేడాది చివరి నాటికి ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు శుద్ధజలం సరఫరా చేసేందుకు పనులను త్వరగా పూర్తి చేయనున్నారు. సకాలంలో పనులు పూర్తి చేస్తే ప్రభుత్వం హావిూ ఇచ్చినట్లు పాలమూరు పట్టణ ప్రజలకు రోజూ నల్లానీరు అందే అవకాశం ఏర్పడుతుంది. పాలమూరు పట్టణంలో మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి పథకాన్ని ఆధునికీకరించడంతో పాటు పట్టణ జనాభాకు అనుగుణంగా మరో 20 ఏళ్ల పాటు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పైపులైన్లు విస్తరించి రిజర్వాయర్లు నిర్మిస్తారు. మిషన్‌ భగీరథ ద్వారా పట్టణానికి అప్పన్నపల్లి వైపు నుంచి వచ్చే ప్రధాన పైపులైన్‌ నుంచి అయ్యప్పకొండపై నిర్మించే బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ద్వారా రోజూ 20 ఎమ్మెల్డీలు, అలాగే భూత్పూర్‌ వైపు నుంచి వచ్చే ప్రధాన పైపులైన్‌ నుంచి మన్యంకొండపై నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ద్వారా రాంరెడ్డిగూడెం ఫిల్టర్‌బెడ్‌తో అనుసంధానం చేస్తూ నీరు సరఫరా చేస్తారు.

దీంతో సమస్య శాశ్వతంగా తొలగనుందని అంచనా.